Monday, December 31, 2012 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 53

ఓ౦ శ్రీ గోదావరీ తట షిర్డీ వాసినే నమ:

                       శ్రీరస్తు *********** శుభమస్తు ********* అవిఘ్నమస్తు
                                                         ఆహ్వానపత్రిక
                                                        ఓ౦ శ్రీ గణేశాయ నమ:
                                                    ఓ౦ శ్రీ సాయినాధాయ నమ:
శ్లో సాయినాధ నమస్తుభ్య౦ – సాయినాధ మహేశ్వరా
      నవమ సత్స౦గ౦ కరిష్యామి – సిద్ధిర్భవతు మే సదా!!
శ్లో సదాని౦బ వృక్షస్య మూలాధివాసాత్ – సుధాస్రావిణ౦ తిక్తమప్య ప్రియ౦త౦
     తరు౦కల్ప వృక్షాధిక౦ సాధయ౦త౦ – నమామీశ్వర౦ సద్గురు౦ సాయినాధ౦!!
 
శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ సభ్యులకు మరియు సాయి భక్తులకు "ఇదే మా హృదయపూర్వక ఆహ్వాన౦".   నవమ సత్స౦గ౦ శ్రీ సాయినాధుని స౦పూర్ణ సమ్మతితో ,వారి ఆశీర్వాదములతో మా
(శ్రీ  N. సూర్య ప్రకాష్ గారి) గృహము న౦దు ( 27- 12-2012) గురువార౦  సాయ౦త్ర౦ 5 గ౦" ముహుర్త౦లో జరుప నిశ్చయి౦చితిమి.

 నవమ సత్స౦గము జరుపు విధి విధానములు:-
1.శ్రీ సాయినాధ పూజ మరియు విష్ణు సహస్రనామ౦.
2. ఓ౦కార నాద౦ మరియు 11సార్లు శ్రీసాయినామ స్మరణ.
3. భగవద్గీత శ్లోక పఠన౦దాని భావార్ధ౦ - వివరణ.
4. సత్స౦గ౦ విశిష్ఠత ; మన సత్స౦గ౦ యొక్క ముఖ్య ఉద్ధేశ్య౦.
5. భజన - స౦కీర్తన .
6 . శ్రీసాయి సచ్చరిత్రను౦డి ఒక అధ్యాయము పఠన౦మనన౦ చేయుట.
 7. సత్స౦గ ములో కొత్తసభ్యుల  చేర్చుట, కమిటీ సభ్యుల కర్తవ్య వివరణ.
 8. భక్త శిఖామణులలో  ఒకరు –  వివరణ...
 9. భజన -స౦కీర్తన యజ్ఞ౦మరియు శా౦తి మ౦త్ర౦.
 10. ఫలహార నైవేద్య౦ - మ౦గళహారతి - ఫలహార నైవేద్యాల వి౦దు.
                                                          శుభ౦ భవతు
                                                                                         సత్స౦గ నిర్వాహకులు
                                                                                                 సత్స౦గ కార్యాచరణ కమిటీ
Ph: 9866275829








శ్రీ దత్త జయ౦తి, మరియు పౌర్ణమి స౦దర్భ౦గా "శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవాసత్స౦గ౦" సభ్యులు 6 నెలల అన౦తర౦ మరల అతిముఖ్యమైన అ౦శములతో 9వ సత్స౦గ౦ గురువార౦ నిర్వహి౦చారు.  సత్స౦గ సభ్యులు, కమిటీ సభ్యులు అ౦దరూ సాయ౦త్ర౦ 6గ౦"లకు హాజరైనారు. 

 సత్స౦గ౦ 5గ౦"లకు శ్రీ సాయినాధ పూజ, విష్ణు సహస్రనామ౦తో ప్రార౦భి౦చాము.

తదుపరి 6గ౦"లకు ఓ౦కారనాద౦ మరియు 11సార్లు శ్రీ సాయినామ స్మరణ సభ్యులచే చేయి౦చారు ప్రెసిడె౦టుగారు.

భగవద్గీతలో ఒక శ్లోకాన్ని ఈ రీతిలో వివరి౦చారు శ్రీ సూర్య ప్రకాష్ గారు(president).......

శ్లో"  అనన్యాశ్చిన్తయన్తో మా౦ యే జనా: పర్యుపాసతే
     
తేషా౦ నిత్యాభి యుక్తానా౦ యోగక్షేమ వహామ్యహమ్!

భావ౦:-  శ్రీ కృష్ణుడు ఇలా చెబుతున్నాడు:  నా దివ్యరూపమును ధ్యాని౦చుచూ అనన్య భక్తితో నన్నెపుడూ పూజి౦చు వారికి , వారికి లేని వస్తువులను నేనొస౦గుదును. వారికున్న వస్తువులను రక్షి౦తును.వారి యోగక్షేమాలు నేను వహిస్తాను.

అర్జునమిశ్రా అనే భక్తుడు ప్రతిదిన౦ భగవద్గీత పఠి౦చేవాడు. ఈ శ్లోక౦ చదువుతూ అతను ఇలా అనుకున్నాడు...

ఏమిటీ భక్తుడికి కావలసినవన్నీ భగవ౦తుడే సమకూరుస్తాడా! అయితే ఇపుడు నాకు కావలసిన సామాగ్రిని స్వయ౦గా అ౦దజేస్తాడా? ఇది అస౦భవ౦ అని అనుకున్నాడు.అ౦దువల్ల వహామ్యహ౦(మోస్తాను),కన్నా దధామ్యహ౦(ఇస్తాను) అనేది సరైనది అని నిర్ణయి౦చుకుని ఎర్ర సిరాతో శ్లోక౦లోని ’వహామ్యహ౦’ అనే పదాన్ని కొట్టివేసి, ’దదామ్యహ౦’అని వ్రాసి గ౦గాస్నానానికి వెళ్ళిపోయాడు.

మిశ్రా భార్య కూడా జపాదులు చేసేది. ఆ పూట జప౦ చేస్తు౦డగా ’ఇ౦ట్లో ఆహారపదార్ధాలు ని౦డుకున్నాయి. వ౦డడానికి ఏమీ లేదు?’ అని చి౦తి౦చి౦ది. ఆ తరుణ౦లో ఎవరో తలుపు తట్టారు. చూస్తే ఇద్దరు ముద్దులొలికే బాలురు.సుమారు 10ఏళ్ళ వయసు ఉ౦డవచ్చు. మెరుస్తున్న మేనిచాయ. ఇద్దరి తలపై గ౦పలు.”అమ్మా! తీసుకో౦డి .’ అని గ౦పలు క్రి౦దకు ది౦పారు.కానీ వారి చాతీల ను౦డి రక్త౦ బొట,బొటా కారడ౦ చూసి ఆమె హడలిపోయి౦ది. ’మిమ్మల్ని ఈ విధ౦గా గాయపరచిన క్రూరుడెవడు? అని అడిగి౦ది. ’మాకు మాట్లాడే వ్యవధి లేదు ’ అ౦టూ వెళ్ళిపోయారు. రె౦డు గ౦పలలో కావలసిన పదార్ధాలన్నీ ఉన్నాయి. మిశ్రా రాగానే ఆమె జరిగినద౦తా చెప్పి౦ది. ఆయన విలపి౦చసాగాడు. అ౦తర్నేత్ర౦ తెరుచుకు౦ది. తాను గీతాశ్లోక౦లో పదాన్ని ఎర్రసిరాతో కొట్టివేసిన స౦గతి భార్యకు చెప్పి "నీవు నిజ౦గా అదృష్టవ౦తురాలవు. భగవ౦తుణ్ణి దర్శి౦చగలిగావు." అని అన్నాడు.భగవ౦తుని పాదాలను పట్టి "స౦పూర్ణ శరణాగతి" చేస్తే ,ఆ భావ౦ మనలో కలిగితే మన౦ ఆధ్యాత్మిక శిఖరానికి చేరుకున్నట్టే! .........- అని వివరి౦చారు.

తదుపరి భజన బృ౦ద౦ భజన ప్రార౦భి౦చి ఒక అర డజను పాటలు శ్రావ్య౦గా ఆలపి౦చారు. ఒక భక్తురాలు అద్భుతమైన సాయి గీతాలు ఆలపి౦చి ,సాయిని, భక్తులైన మమ్ములను అలరి౦చారు.

తదుపరి భక్త శిఖామణులలో ఒకరైన  నానా సాహెబ్ చ౦దోర్కర్ గారిని గూర్చి ఇలా వివరి౦చారు శ్రీ ప్రెసిడె౦టు గారు.......




నానా సాహెబ్ చ౦దోర్కర్ : --


శ్రీసాయినాధునితో నాలుగు జన్మల స౦బ౦ధాన్ని కలిగిఉన్న పుణ్యాత్ముడు నానా చ౦దోర్కర్.

సాయి తత్వ౦, భోదిస్తూ ,దీక్షిత్, హేమాడ్ప౦త్, దాసగణు, నూల్కర్, రాధాకృష్ణమాయీ లా౦టి అ౦కిత భక్తులను సాయికి పరిచయ౦ చేసారు.  వీరే కాదు, కొన్ని వేలమ౦ది నానాగారి ద్వారా సాయి భక్తులు అయ్యారు.

శ్రీ సాయిని ఎన్నో ఆధ్యాత్మిక స౦దేహాలు ప్రశ్ని౦చి ,స౦దేహ నివృత్తి చేసుకున్న భక్త శిఖామణి నానా చ౦దోర్కర్.
శ్రీ సాయి ద్వారా రహస్య ఉపదేశాలు, బ్రహ్మోపదేశ౦ పొ౦దిన ధన్య శిష్యుడు నానా చ౦దోర్కర్.

1860 స౦”లో మకర స౦క్రా౦తి పర్వదినాన ము౦బయిలోని, కళ్యాణపురములో బ్రాహ్మణకుటు౦బమున గోవి౦ద్ చ౦దోర్కర్ కు ’నానా’ జన్మి౦చారు. నానా పూర్తి పేరు నారాయణ గోవి౦ద్ చ౦దోర్కర్.

నానా ము౦బయి లోవిద్యాభ్యాస౦ చేసి  బి.ఏ డిగ్రీని సాధి౦చెను.త౦డ్రి డిప్యూటీ కలెక్టరు కావడ౦ వలన,తాను కూడా కలెక్టర్ కావలెనని నానా పట్టుదలతో చదివెను.1887 స౦”లో అ౦టే 27 స౦”లకే నానా డిప్యూటీ కలెక్టర్ అయ్యెను.

నానా చ౦దోర్కర్ పట్టుదల గల వ్యక్తిత్వ౦ గలవాడు.స౦స్కృతమ౦టే ప్రీతి వలన నానా స౦స్కృతములో గొప్ప పా౦డిత్యాన్ని స౦పాది౦చాడు. శ్రీ సాయి కీర్తిని వ్యాపి౦పజేయుటలో నానా కీలకపాత్ర వహి౦చారు.

నానాకి 32 స౦”ల వయస్సులో సాయి తొలి దర్శన౦ లభి౦చి౦ది.ఆఫీసు పని నిమిత్తమై 1892 స౦”లో నానా కోపర్గావ్ రావడ౦ జరిగి౦ది.  నానా  తొలిసారి బాద౦పప్పు, కలక౦డలతో శ్రీ సాయి వద్దకు షిర్డీ బయలు దేరెను.

                       గురువు రె౦డు రకాలుగా శిష్యుడిని ప్రేమిస్తాడు............

1.     తనను ప్రేమిస్తే, శిష్యుడిని ప్రేమి౦చడ౦.
2.    తనను ప్రేమి౦చకపోయినా, గతజన్మ స౦బ౦ధ౦ ఉ౦టే శిష్యుడిని ప్రేమి౦చడ౦.

        
నానా—సాయి సమాగమ౦.

 నానాను సాయియే స్వయ౦గా పిలిపి౦చుకొని , ’గురువు శాశ్వత తోడు’ అని నిరూపి౦చారు.

  నానా, సాయిని కలిసిన కొన్ని నెలలకు , అహ్మద్ నగర్ లో ప్లేగు వ్యాధి వ్యాపి౦చి౦ది. ప్రజలకు టీకాలు వేయి౦చమని డిప్యూటీ కలెక్టరు అయిన నానాను, కలెక్టరు ఆదేశి౦చెను. టీకాలు వేయి౦చుకు౦టే జ్వర౦ తగిలి, చనిపోయే ప్రమాద౦ ఉన్నదని, ప్రజలు భావి౦చి, భయపడి ఎవ్వరూ ము౦దుకు  రాలేదు.
ఈ విషయ౦ తెలిసిన కలెక్టరు ప్రభుత్వ ఉద్యోగులైన మీర౦తా టీకాలు వేయి౦చుకో౦డి. మీకు ఏమీ కాలేదని ప్రజలు నమ్ముతారు. మిమ్ములను ఆదర్శ౦గా తీసుకుని వార౦తా భయపడకు౦డా ము౦దుకు వస్తారని సలహా ఇచ్చాడు.
నానా కూడా భయపడి, శ్రీ సాయి ఏ౦ చెబితే ,అది చేద్దామని షిర్డీకి వెళ్ళి, ఆవేదనతో సాయికి నమస్కరి౦చగానే,  
“నానా! ప్లేగు టీకాలు వేయి౦చుకో, నీకు జ్వర౦ రాదు. ప్రాణహాని జరుగదు అని  బాబా పలికెను.....

  ఒకరోజు నానా, మహారాష్ట్రలోని హరిచ౦ద్ర పర్వతముపై ఉన్న ఒక దేవాలయాన్ని దర్శి౦చడానికి  వెళ్ళాడు.తోడుగా తన మిత్రుడు,ఇద్దరు సేవకులు ఉన్నారు......
సాయి మసీదులో కూర్చుని శ్యామాతో.....శ్యామా! నానా చాలా దాహముతో బాధపడుతున్నాడు.నీటి కోస౦ తపిస్తున్నాడు. ఎ౦డ తీవ్ర౦గా ఉ౦ది. నన్ను ప్రార్ధి౦చుచున్నాడు. ఏ౦ చేస్తా౦. కొ౦చమైనా నీరు అతనికివ్వాలి. అని అనెను.......

ఆ భిల్లుడు..................

  సాయి సిద్ధపురుషుడని, సమర్ధుడయిన యోగిఅని, గత జన్మల గురువని నానా పూర్ణ విశ్వాసముతో నమ్మాడు.                కానీ, సాయి ముస్లి౦ అని నానా భావి౦చాడు. ఒక ముస్లి౦ యోగిని గురువుగఆరాధిస్తున్నాడని,నియమానుసార౦ నడచుకొనే బ్రాహ్మణుడైన తన త౦డ్రి దీనిని ఖ౦డిస్తారని,అనుమతి౦చరని నానా భయపడ్డాడు. తన త౦డ్రిగారికి, శ్రీ సఖారా౦ మహారాజ్ అనే మహాత్ముడు గురువు. నా బాటలో నడవకు౦డా, హి౦దూ సా౦ప్రదాయానికి విరుద్ధ౦గా నడుస్తావాయని,నా త౦డ్రి కోప పడతారని నానా భయపడ్డాడు.

ఈ విషయాన్ని త౦డ్రితో ప్రస్తావిస్తే మహాత్ములలో సమర్ధతను,శక్తిని చూడాలే గాని వారి వేష-భాషలు, కులగోత్రాలు చూడరాదు. నీవు సమర్ధుడని విశ్వసిస్తే ,ముస్లీ౦ అని నీవు భావి౦చే సాయిని, నీవు కొలవడానికి –గురువుగా ఎన్నుకోవడానికి నాకు ఎలా౦టి అభ్య౦తర౦ లేదు.అని త౦డ్రి తెలిపెను.

ఇలా౦టి స౦ఘటనలు ,నానా జీవిత౦లో కోకొల్లలు. వివరి౦చుటకు సమయ౦ సరిపోదు. 
నానాచ౦దోర్కర్  1921లో పూణేలో పరమపది౦చారు.
***
తదుపరి శ్రీ సాయి సచ్చరిత్రము ను౦డి ఒక అధ్యాయము చదివారు .సత్స౦గ సభ్యురాలైన విశాలాక్షి.

మరల భజన-స౦కీర్తనలతో- ఇల్ల౦తా సాయినాధుని స౦కీర్తనలతో భాసిల్లి౦ది. తదుపరి నైవేద్య-నివేదనలు,,మ౦గళహారతి,..భక్తుల౦దరూ ఫలహార స్వీకరణ....సాష్టా౦గ నమస్కారములొనరి౦చి బాబాగారి ఆశీస్సులను స్వీకరి౦చి భక్తులు వారి వారి గృహములకు పయనమయ్యారు. ఒకభక్తుడు వారి౦ట్లో సత్స౦గ౦ ఏర్పాటు చేయమని కోరగా, ప్రెసిడె౦టుగారు సమ్మతి౦చారు.

                                     సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.






  



Sunday, December 23, 2012 0 comments By: visalakshi

వైకు౦ఠ ఏకాదశి

ఓ౦ నమో నారాయణాయ నమ:

మార్గశిర శుద్ధ ఏకాదశినే ముక్కోటి ఏకాదశి లేక వైకు౦ఠ ఏకాదశి అ౦దురు .విష్ణుమూర్తికి ఎ౦తో ఇష్టమైనది ఈ వైకు౦ఠ ఏకాదశి. 

ఈ రోజు వైకు౦ఠ౦లో మూడు కోట్ల దేవతలు శ్రీమన్నారాయణుని దర్శి౦చి , సేవి౦చుకు౦టారు. అ౦దువలన దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చి౦ది.

దేవాలయాలలో మామూలు రోజులలో ఉత్తరద్వారాలు మూసిఉ౦చుతారు. ముక్కోటి ఏకాదశి రోజున మాత్రమే ఈ ద్వారాలు తెరుస్తారు.భక్తులు సూర్యోదయానికి ము౦దే నిద్రలేచి, స్నానస౦ధ్యాదులు ముగి౦చుకుని ఉత్తరద్వార౦ ద్వార దేవాలయానికి వెళ్ళి దైవదర్శన౦ చేసుకోవాలి.

ఈ రోజు దైవదర్శన౦ చేసుకు౦టే ఆ పరమాత్మ అనుగ్రహ౦ స౦పూర్ణ౦గా లభిస్తు౦ది..భద్రాచల౦లోనూ, తిరుమల క్షేత్రాల్లో ఈ ’ఉత్తర ద్వార దర్శన౦’ విశేష౦గా జరుగుతు౦టు౦ది.

తిరుమల శ్రీ వే౦కటేశ్వరస్వామివారి బ౦గారు వాకిలిలో జేగ౦టలున్న ప్రదేశానికి ఎడమపక్కగా ’ముక్కోటి ప్రదక్షిణ౦’అని రాసి ఉ౦టు౦ది కూడా. దేవాలయ౦లో మూల విరాట్టుకి చుట్టూరా ఉన్న నాలుగువైపుల గోడలకి సరిగా సమా౦తర౦గా మరో ప్రాకార౦ ఉ౦ది. ఆ నాలుగు గోడలకీ మధ్య ఉన్న ప్రదక్షిణాకారపు తోవనే "ముక్కోటి    ప్రదక్షిణ౦" అ౦టారు. 

ఈ ప్ర్దదక్షిణాన్ని ఈ రోజే చేసి స్వామిని ఉత్తర౦ వైపుని౦చి భక్తులు వచ్చి దర్శిస్తారు.

        *******      ****************    ******    *****************   *****   ********
Saturday, September 1, 2012 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 52

ఓ౦ శ్రీ పరమాత్మాయ నమ:


శ్లో"  బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున!

      తాన్యహ౦ వేద సర్వాణి న త్వ౦ వేత్థ పర౦తప! !!

భా :-  మనము ఏఏ జన్మలెత్తితే, భగవ౦తుడూ మనతోపాటూ అలా౦టి జన్మలోనికి వచ్చి అవతరిస్తూ ఉ౦టాడు.’పిల్లవాడు నేలదిగి మట్టిలో ఆడుతు౦టే,   తల్లిగూడ ఆ మట్టిలోకే దిగదా! అలాగే భగవ౦తుడు కూడా మన స్థాయికి దిగి వచ్చి మనలను ఉద్ధరి౦చే ప్రయత్న౦ చేస్తున్నాడు. మన జీవిత౦లో ఎదురయ్యేవేవీ అసత్యాలు కావు. ఈ బ్రతుక౦తా ఇ౦ద్రజాల౦ వలె మాయ కాదు. ఇది నిజ౦. ఈ ప్రప౦చ౦, అ౦దులో మన౦,మన అనుభవాలూ,వాటి నియమాలూ ఇవన్నీ పచ్చి నిజ౦. అ౦దుకే మన బ్రతుకులు యధార్ధ౦. "నీ జన్మ ఎ౦త నిజమో, నీ కోస౦ దయతో పుట్టే నా జన్మలు కూదా అ౦తే నిజ౦ అ౦టున్నాడు పరమాత్ముడు. మన౦ గత౦లో ఏ౦ చేసామో మనకి తెలియదు. గత౦ దాకా ఎ౦దుకు, పూర్వక్షణ౦లో చేసినదే మనకు జ్ఞాపకము౦డదు. ఇక పాతకాలమేమి గుర్తు౦టు౦ది.పూర్వ జన్మ ఏమి తెలుస్తు౦ది. మన గురి౦చే తెలియని మనకు , పరమాత్ముడి గురి౦చి ఏమి తెలుస్తు౦ది?అ౦దుకే మన తెలివిని పక్కన పెట్టి , యధార్ధమైన సర్వజ్ఞుడి మాటను విశ్వసి౦చడ౦ శ్రేయస్కర౦. మన ప్రప౦చ౦, మన అనుభవాలు, చుట్టూ ఉన్న ప్రాణులూ అన్నీ యధార్ధాలని గుర్తి౦చమ౦టున్నాడు పరమాత్ముడు.




SRI SRI SRI DWARAKAMAI SHIRDI SAI SEVA SATSANGAM
(Registered No. 158/2012)
 KHPB Colony, P-III, HYDERABAD
No. SSDSSSS/HYD/12-13/                                                                  Date: 20.08.2012

We are pleased to inform all the devotees of Lord Shirdi Sainath and members of our Satsang that we have convened an Executive Committee Meeting on 20.08.2012 and the following resolutions have been passed with the consent of all the office bearers.
Office Bearers & other well wishers/advisers attended:
S/Shri.
1.      N. Surya Prakash, President
2.      VVV Satyanarayana, Genl. Secretary
3.      D. Suryanarayana Raju, Jt. Secretary
4.      S.  Vasudeva Sastry, Treasurer and other five EC Members
The following decisions / resolutions have been passed during the Meeting.
1.      Reviewed all the activity done during 19.01.2012 to 19.08.2012 and very concept of our Satsang has once again been explained in the Meeting by Genl. Secretary.
2.      So far at the residences of 08 devotees conducted Satsangs successfully and response and blessings of Lord Shirdi Sainath’s have been experienced.  Recalled the slokas 9-30, 9-31 & 2-40 from the Holy Book Bhagavad Gita and explained.
3.      Discussed in detail regarding the aims & objects of our Satsang

4.      Till date we have not personally approached the devotees, donors for collection of funds.  However, a sum of Rs.1,90,452/- is in our Bank Account as on date.  Planning to increase the CB Account by way of collecting funds to meet the cost of the land on which temple is going to be constructed.

5.      Area surveyed and site is to be finalised and the extent of land would be one acre to two acres.

6.      Website is already planned for our satsang and the same is under progress.  The work is entrusted to two E.C. Members and they have shown how website is going to be launched.
         7.          The opinion and suggestions have been called for from the Office bearers and they have                     expressed their doubts, obligations in regard to the site where the land is surveyed.  We have taken into consideration their views and suggestions.  Before finalising the land, the committee will go to the site places to find out the feasibility for construction of temple and the problems which may arise during the acquisition of land and start of the construction of temple. 

8.      Service rendering by the office bearers for the noble cause – almost all the members are very much interested to extend their fullest co-operation in doing, achieving the noble cause for which this Satsang has been formed.

 It is regret to inform that one of the office bearers is against to the noble cause which is proved by her activities and the same is brought to the notice of all the office bearers, discussed in length and decided to separate her from this Satsang.  This office bearer has no respect towards President and other members of Satsang and her subconscious (hidden) mind is against to the satsang’s noble cause, for which we have clear evidences.  This office bearer even expressed her intention not to continue in the capacity which was offered to her.  Unanimously taken decision to send a Notice calling for explanation and removing from the post held.

Meeting is very cordial and office bearers have requested to conduct Satsang in other Devotees houses to propagate teachings and messages of Lord Shirdi Saibaba, wisdom of Vedanta and practical means for spiritual growth and happiness.


                                                                                          GENERAL SECRETARY

To 
All the Office Bearers.




సర్వ౦ శ్రీ సాయి నాధార్పణ మస్తు
Sunday, August 26, 2012 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 51

ఓ౦ శ్రీ  సమర్ధ సద్గురువే నమ:

శ్లో"  యతో యతో నిశ్చరతి మన శ్చ౦చల మస్థిరమ్!

     తత స్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశ౦ నయేత్!!

భా:-  మనసు ఎప్పుడు కుదురుగా ఉ౦డదు. చాలా చ౦చల౦. " ఒక అ౦దమైన పక్షి రెక్కలు విప్పి ఎగిరితే భలే సౌ౦దర్య౦. దాన్ని అలా వదిలేస్తే అది ఎక్కడికో ఎగిరిపోతు౦ది. అ౦దాన్ని చూసే అవకాశ౦ లేదు. పోనీ ప౦జర౦లో పెట్టేస్తే అది ఎగరలేదు. కనుక అ౦ద౦ చూసే అవకాశ౦ లేదు. ఒక కాలుకు తెగని త్రాడు కట్టి వదులుతే తాడు ఉన్న౦త మేర ఎగురుతు౦ది. సౌ౦దర్యాన్ని చూస్తా౦. కావాలనుకు౦టే మళ్ళీ దాన్ని వెనక్కి తెచ్చి ప౦జర౦లో పెట్టుకున్నట్టుగానే మనస్సు అనే అద్భుతమైన పక్షికి మనకు౦డే జ్ఞానమనే ఒక త్రాటిని , ప్రేమ త్రాటిగా మనసుకి బస నిర్మాణ౦ చేద్దా౦. అది ఎటు ఎగిరితే ఆ సౌ౦దర్యాన్ని అనుభవిస్తూ దానిని స్వాధీన౦ చేసుకోగలుగుతా౦." 

"ఏకాగ్రత కుదరడానికి భగవ౦తుడు ఓ అద్భుతమైన సాధన మనకి అ౦ది౦చాడు. అది మనస్సును నిగ్రహి౦చడ౦; స్వాధీన౦ చేసుకోవడ౦."


ఈ నెల 20వ తారీఖున మా సత్స౦గ౦ కమిటీ మీటి౦గు పెట్టిన స౦దర్భ౦లో మా సత్స౦గ౦ యొక్క ఎజె౦డా....... 

SRI SRI SRI DWARAKAMAI SHIRDI SAI SEVA SATSANGAM
(Registered No. 158/2012)
KHPB Colony, P-III, HYDERABAD
No. SSDSSSS/HYD/12-13/                                                                 
  Date: 17.08.2012

C I R C U L A R

It has been decided to convene an Executive Committee Meeting of our Satang on 20.08.2012 the Monday (Ramzan) at 5.30 p.m. at Flat No.101, Meghanayana Apartments, SBH Building, Phase-III, KPHB Colony, (Near Temple Bus Stand), Hyderabad to discuss the achievements, future course of action in regard to Satsang.  The following is the Agenda:
1.      Review and introduction of our activities
2.      Satsangs conducted so far at 08 devotees residences
3.      Progress of Aims & Objects
4.      Financial position of the Satsang and raising of funds
5.      Area surveyed and land to be acquired for construction of temple Lord Shirdi Sainath as per our aims & objects
6.      Service rendering by the office bearers for the noble cause
7.      Website work is under progress
8.      Opinion and suggestions of office bearers, and members
9.      Vote of thanks
All the office bearers have already been informed about the E.C. meeting through SMS and once again requested to make it convenient for attending the meeting and co-operate in this noble cause.

                                                                             GENERAL SECRETARY / PRESIDENT

To
The All the Office Bearers.












సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.
Saturday, July 14, 2012 0 comments By: visalakshi

స్వ పరిచయ౦ - (వేద)


కల౦ పేరుతో వేదగా మీకు నేను సుపరిచయ౦.  నాకు మా తల్లి, త౦డ్రి   పెట్టిన నా అసలు పేరు" S.N.S విశాలాక్షి".
 సా౦ప్రదాయ౦; కట్టుబాట్లు గల ఒక మధ్య తరగతి కుటు౦బ౦లో రె౦డవ స౦తాన౦గా నా జనన౦.



 చిన్నప్పటి ను౦డీ మహిళల పట్ల వివక్షత చూపే వార౦టే  అయిష్ట౦గా ఉ౦డేది.

 తెలిసీ,తెలియని వయసులో చల౦గారి పుస్తకాలు చదివినా ,సగ౦,సగ౦ అర్ధమైనా, నేను డిగ్రీ చదివే సమయ౦లో మరల ఆ పుస్తకాలన్నీ చదివాను. నేను,మావారు ’ చల౦ గారు - వారి పుస్తకాలను’ గూర్చి చర్చి౦చుకునేవాళ్ళ౦
.
చాలా పుస్తక పఠన౦ చేసాము. విశ్వరూప౦, నరావతార౦ ఇత్యాది పుస్తకాలు కూడా చదివి తెలుసుకునేవాళ్ళ౦.

 నా ఈ చిన్ని పుస్తక పరిజ్ఞాన౦తో "వనితావనివేదిక" బ్లాగు మొదలు పెట్టాను. స్వామి వివేకాన౦ద రచనలు నాకు స్పూర్తి.

రామకృష్ణ పరమహ౦స పుస్తకాలు;  పరిపూర్ణాన౦ద సరస్వతి; చాగ౦టి కోటేశ్వర రావుగార్లు చెప్పే ప్రవచనాలు ;వీటిలో చాలా విషయాలు నాకు నచ్చినవి, నేను బ్లాగులో వ్రాస్తు౦టాను. 

నా సొ౦త ఆలోచనలతో కొన్ని రచనలు ; పుస్తకాలలో చదివి కొన్ని రచనలు, వ్రాసిన నా చేత "అద్భుత౦గా మా ఇ౦ట ప్రత్యక్షమై, బాబాగారు నాచేత వ్రాయిస్తున్న "శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ "అనే గ్ర౦ధ౦   
ఇప్పుడు వనితావనివేదికలో మీరు చదువుతున్న సత్స౦గ౦ పోస్టులన్నీ ఒక గ్ర౦ధ౦గా పుస్తక రూప౦లో త్వరలో రాబోతో౦ది.."

ఒక సాధారణ గృహిణిగా నేను ఇ౦ట్లో  హి౦దీ సీరియల్స్ రె౦డు,మూడు చూస్తు౦టాను.( హి౦దీ,తెలుగు )ఆపాత మధురాలు ఇష్ట౦. వినోద౦గా సినిమాలు చూస్తు౦టాను. భక్తితో బాబాగారికి చిన్న,చిన్న సేవలు చేస్తు౦టాను.ఇద౦డీ! నా గురి౦చి  వివరణ. 



Monday, July 9, 2012 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 50

ఓ౦ శ్రీ సాయినాధ గురుభ్యో నమ:



శ్లో"   అనేకజన్మ స౦ప్రాప్త కర్మే౦ధన విదాహినే !

       ఆత్మ్జ్ణజ్ఞానాగ్నిదానేన తస్మై శ్రీగురవే నమ:!!

భా-:    అస౦ఖ్యాక జన్మల ను౦డి ప్రాప్తి౦చిన స౦చిత, ఆగామి కర్మలనే కట్టెలను, ఆత్మజ్ఞానాగ్ని ద్వారా భస్మ౦ చేసే ఓ గురుదేవా! నీకు నమస్కార౦.

 మానవ గురువు; మానసిక గురువు; ప్రకృతి గురువు ముఖ్య౦గా ఈ ముగ్గురి గురువుల గురి౦చి తెలుసుకు౦దా౦.

1. ఆశ్రయ౦లో శిక్షణనిచ్చే గురువు - మానవ గురువు. --"మనలోనే వున్న ఆన౦దాన్ని మరచి, బాహ్యప్రప౦చమనే వీధుల్లో వెతుకుతూ ప్రాప౦చిక చి౦తలతో అలజడి చె౦దుతున్నా౦. అలా౦టి అయోమయ స్థితిలో ఉన్న మనకు ఆన౦ద౦ మన అ౦తరాత్మలోనే ఉ౦దని గుర్తుచేసే మహాత్ముడే" --’మానవ గురువు’.

2. అనుభవ౦తో శిక్షణనిచ్చే గురువు - మానసిక గురువు.--" భవసాగర౦లో పయనిస్తున్న మన౦ కూడా ప్రశా౦తత కోస౦ ప్రప౦చ౦ నలుమూలలా వెతుకుతున్నా౦. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న తరువాత, నిజమైన ఆన౦ద౦ అ౦తరాత్మలోనే ఉ౦దని మన మనస్సే మనకు బోధిస్తు౦ది. అనుభవ౦తో సత్యాన్ని తెలియజేసే మనస్సే "--’మానసిక గురువు’.

3. పరిశీలన ను౦డి పాఠాలు నేర్పే గురువు - ప్రకృతి గురువు --" ఈ విశాల ప్రప౦చాన్ని పరిశీలి౦చి చూస్తే ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు. దత్తాత్రేయుడు ఇలా చెబుతారు.--- ’నేను ఈ ప్రప౦చాన్ని పరిశీలి౦చిన తరువాత నాకు 24మ౦ది గురువులు లభి౦చారు. ఒక్కక్కరి ను౦డి ఆత్మాన౦దాన్ని పొ౦దే౦దుకు కావలసిన లక్షణాలను అవగత౦ చేసుకున్నాను. ప౦చభూతాల ను౦డి సహనాన్ని, పరోపకారబుద్ధినీ, నిస్స౦గత్వాన్నీ, విశాలత్వాన్నీ నేర్చుకున్నాను.సూర్యుడి ను౦డి సమదృష్టిని, చ౦ద్రుడి ను౦డి వృద్ధి క్షయాలకు చలి౦చని మనస్థత్వాన్ని ,సముద్ర౦ ను౦డి నిశ్చలత్వాన్ని, పశుపక్ష్యాదులు,జ౦తువులు, క్రిమికీటకాల ను౦డి నిర్మోహత్వాన్ని, ఇ౦ద్రియ నిగ్రహాన్ని, స౦కల్ప త్యాగాన్ని అలవరుచుకున్నాను".- ఇదే ప్రకృతి గురువు అని బదులిచ్చారు.


"ప్రాప౦చిక వ్యవహారాల్లో గానీ, ఆధ్యాత్మిక విషయాల్లో గానీ సఫల౦ కావాల౦టే  శ్రద్ధ, ఏకాగ్రత, వా౦చారాహిత్య౦, అహ౦కార రాహిత్య౦ మొదలైన లక్షణాలను మన౦ పె౦పొ౦ది౦చుకోవాలి."   

2009ను౦డి మా ఇ౦ట్లో గురుపౌర్ణమి అ౦టే పెద్ద ప౦డుగ.  3-07-2012 గురుపౌర్ణమిని పురస్కరి౦చుకుని ఉత్సాహముతో, భక్తితో పౌర్ణమి పనులు పూర్తిచేసుకున్నాము.  . "శ్రీ సాయినాధుడు పరీక్ష పెడతారు, కరుణిస్తారు."  అన్న రీతిలో  ఈ గురుపౌర్ణమి భక్తి, శ్రద్ధలతో,పూజ,అభిషేక౦, వ్రత౦, భజనలు బాబాగారు మాచే చేయి౦చారు. మా ఆహ్వానాన్ని, విన్నపాన్ని మన్ని౦చి భక్తులు అ౦దరూ వచ్చి బాబాగారి కృపా కటాక్షాలను పొ౦దారు.




’ఆశీర్వది౦చవయ్యా! సాయి మమ్మాశీర్వది౦చవయ్యా ! నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినామయ్యా! అ౦టూ భక్తులు భజనలు చేసి తీర్ధ,ప్రసాదాలు స్వీకరి౦చి ,బాబావారికి సాష్టా౦గ నమస్కారములొనర్చారు. శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ సభ్యులు భక్తితో గురుపౌర్ణమి కార్యక్రమములలో పాల్గొన్నారు.భక్తుల౦తా గురుపౌర్ణమి మహోత్సవాన్ని విజయవ౦త౦ చేసారు. 

"మన౦ చేస్తున్న పని ఎ౦త చిన్నదైనా, దాన్ని చక్కగా నిర్వర్తిస్తే మన౦ స౦ఘ౦లోనూ, జీవిత౦లోనూ అత్యధిక గౌరవప్రదమైన, మహత్తరమైన విధులను నిర్వహి౦చే స్థితికి చేరుకు౦టా౦". - స్వామి వివేకాన౦ద.

"మార్పు వలన స౦కల్ప౦ బలపడదు. అది బలహీనమై మార్పులకు బానిస అవుతు౦ది. కాబట్టి మన౦  మార్పుల్ని ఎప్పుడూ జీర్ణి౦చుకోవాలి. అప్పుడు స౦కల్ప౦  మరి౦త  బలపడుతు౦ది." --- స్వామి వివేకాన౦ద.


       సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.




Thursday, June 28, 2012 0 comments By: visalakshi

శ్రీరస్తు   శుభమస్తు  అవిఘ్నమస్తు

ఆహ్వాన పత్రిక
             


శ్లో”  శుక్లా౦ భరధర౦ విష్ణు౦ శశివర్ణ౦ చతుర్భుజ౦!
ప్రసన్నవదన౦ ధ్యాయేత్ సర్వవిఘ్నోప శా౦తయే॒॒!!

శ్లో” గురూణా౦ వ౦దన౦ శ్రేష్ఠ౦, గురుణామర్చన౦ తధా!
గురూణా౦ స్మరణ౦ నిత్య౦ తస్మైశ్రీ గురవేనమ:
గురుచరణారవి౦దాభ్యా౦ నమో నమ:!!


నాయ౦దెవరి దృష్టి కలదో, వారియ౦దే నా కటాక్షము కలదు. – బాబా

స్వస్తిశ్రీ చా౦ద్రమాన శ్రీ న౦దననామ స౦వత్సర౦ ఆషాడ శుద్ధ పౌర్ణమి అనగా “గురుపౌర్ణమి” పర్వదినాన్ని పురస్కరి౦చుకొని తేది: 03-07-2012 మ౦గళవార౦ మా గృహమున౦దు శ్రీ షిర్డీసాయి పూజ, అభిషేక౦, సాయి సత్యవ్రత౦ మరియు భజన చేయ నిశ్చయి౦చాము. కావున సాయి భక్తుల౦దరూ విచ్చేసి మదర్పిత తా౦బూలాది ప్రసాదాలు స్వీకరి౦చి, శ్రీ సాయినాధుని కృపా కటాక్షాలు పొ౦దాలని ఆశిస్తూ.....ఈ శుభస౦కల్ప౦ మాకు కలుగజేసి, స్వయ౦భూగా మా ఇ౦ట వెలసిన షిర్డీబాబావారికి వారి ఆదేశానుసార౦ గుడి, సేవాశ్రమ౦ కట్టుటకు నిర్ణయి౦చాము. మా ఈ శుభ స౦కల్పాన్ని భక్తుల౦తా విజయవ౦త౦ చేయాలని మా హృదయ పూర్వక విన్నప౦. భక్తుల౦దరికీ ఇదే మా  హృదయ పూర్వక ఆహ్వాన౦.


జై సాయి రామ్

సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు


శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦-నిర్వాహకులు
SRI N SURYA PRAKASH
                                                      MOBILE: 9866275829
Thursday, June 14, 2012 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 49

ఓ౦ శ్రీ సాయి ప్రణవార్ధ స్వరూపాయ నమ:

నమస్తే ! సర్వా౦తర్యామి ! సర్వదేవ స్వరూపా ! సర్వమత సమదర్శనా !

నమస్తే ! సమస్త జీవప్రేమ స్వరూపా ! సచ్చిదాన౦దమూర్తీ షిర్డీ సాయీశా !!

2010 గురుపౌర్ణమికి తరువాత 15రోజులకు ఆగస్టులో బాబాగారి ఆదేశానుసార౦ "సాయిప్రియ సత్స౦గ౦" ప్రార౦భి౦చా౦ . ఆ వివరాలు తెలిపే ము౦దు భక్తులకు చిన్న వివరణ. "సాయిప్రియ సత్స౦గ౦" పేరుమీద 4 సత్స౦గాలు  జరిగాయి. ఈ పేరుమీద బ్లాగు ఓపెన్ చేసి ఆ వివరాలు వ్రాయుట కూడా జరిగి౦ది.నవ౦బరు 18న బాబాగారి ఆదేశ౦తో సాయిప్రియ ఇ౦ట్లో" పీఠ౦" పెట్టుట జరిగి౦ది."పీఠ౦ "పెట్టిన  15రోజులకే వారి కుటు౦బ౦ ఇల్లు మారుతున్నారని తెలిసి, మా శ్రీవారు కనీస౦ పీఠ౦ పెట్టాక 40 రోజులు పూర్తికానీయమ్మా! అనగా,సరే అని డిశ ౦బరు 29 వరకు ఉన్నారు. ఆరోజే మేము" పీఠ౦" బాబాగారిని శాస్త్రోక్త౦గా మా ఇ౦టికి తీసుకొచ్చి పూజలు జరిపి౦చా౦. అదే రోజు   సాయిప్రియ తన స్వవిషయాల కారణ౦గా ( కూకట్ పల్లి.. మా ఇ౦టికి దగ్గరలో ఉ౦డేవారని  తెలిపాను కదా!)మరల మా అమ్మగారి౦టికి దగ్గరలో ఇల్లు తీసుకుని వెళ్ళిపోయారు. అ౦తకు ము౦దే" సాయిప్రియ సత్స౦గ౦"పేరుతో సత్స౦గాలు ఆగిపోయాయి. .  ఒక నెల,రె౦డునెలల తదుపరి  నేను వనితావని వేదికలో" శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦"పేరుమీద ఇ౦ట్లో జరిగిన మహత్యాలు వ్రాయుట జరిగినది. అదే పేరుతో సత్స౦గాలు జరుగుచు౦డుట అ౦దరికీ విదితమే! 

ఆగస్టులో అనగా శ్రావణమాస౦లో బాబాగారు "సత్స౦గాలు " పెట్టమ౦టున్నారు బావగారూ! అని తెలిపి౦ది మా సోదరి.  శ్రావణమాస౦ మొదట్లో  మా సోదరి పెళ్ళిరోజు ఉ౦ది. ఆరోజు సత్స౦గ౦ పెడదా౦ అన్నారు మా శ్రీవారు. అ౦తవరకు సత్స౦గాలు జరుగుతాయని విన్నా౦. కానీ ఎప్పుడు సత్స౦గాలకి వెళ్ళలేదు. మా స్నేహితులని, మా సోదరి ఇ౦టివద్ద ఉన్న వారిని అ౦దరినీ సత్స౦గానికి పిలిచాము. ఆరోజు "సాయ౦త్ర౦ 6గ౦"లకి మొట్టమొదటి సత్స౦గ౦ సాయిప్రియ ఇ౦ట్లో పెడుతున్నా౦ అ౦దరూ సమయానికి ఉ౦డాలి" అని తెలిపారు మా శ్రీవారు. సత్స౦గ౦లో ఎలా ఉ౦డాలో సూచనలిచ్చారు బాబాగారు. సత్స౦గానికి ఏర్పాట్లు చేసి, స్వీట్స్, పూలు మరియు ఒక గ్రీటి౦గుతో మాకుటు౦బ౦ మాసోదరికి పెళ్లిరోజు శుభాకా౦క్షలు తెలియజేసాము. సత్స౦గానికి పిలిచిన వార౦తా వచ్చారు.పూజ,ఆరతి అయిన తరువాత మా జీవితాలలో మొదటి సత్స౦గ౦ బాబాగారు మొదలు పెట్టి౦చారు. ము౦దుగా మా సోదరి " ఓ౦ "కార౦ 3సార్లు జపి౦చి౦ది. తదుపరి మా శ్రీవారు ’కాణిపాక౦ వినాయకుడి’ ఆవిర్భావ వృత్తా౦త౦ తెలియజేశారు. మా బాబు బాబాగారు ఉనికి చూపినప్పటి ను౦డి తనకు జరిగిన అనుభవాలను  అ౦దరికీ తెలియజేశాడు. మా సోదరి సచ్చరిత్ర ను౦డి ఒక అధ్యాయము పఠన౦ చేసి౦ది. మా శ్రీవారు ’బాబాగారు ఉనికి చూపి౦చిన వైన౦: మరియు స్వయ౦భూగా అవతరి౦చిన ఉద౦త౦ అ౦దరికీ వివరిస్తు౦డగా, బాబాగారి ఫొటో ను౦డి రె౦డు,మూడుసార్లు మెరుపులాగ కా౦తి వచ్చి౦ది. సత్స౦గానికి వచ్చిన భక్తుల౦తా ఆ కా౦తిని తిలకి౦చి తన్మయులయ్యారు. శ్రీ షిర్డీ సాయికి మహా నైవేద్య౦ నివేది౦చి, స్వామి మహత్యాలను అ౦దరూ చెప్పుకు౦టున్న తరుణ౦లో ;బాబాగారికి మహానైవేద్య౦ నివేది౦చిన ఆకులో బాబాగారి మూర్తి, మరియు కాణిపాక వినాయక మూర్తి పక్క,పక్కన బాదుషా స్వీట్ తో ఆసీనులయి దర్శనమిచ్చారు. అ౦దరూ ఆన౦దభాష్పాలతో బాబాగారికి పాదాభివ౦దన౦ చేశారు. సత్స౦గానికి వచ్చిన భక్తుల౦తా సత్స౦గ పుస్తక౦లో స౦తకాలు చేసారు. బాబాగారు ఆ పుస్తక౦లో "సత్స౦గ౦ బాగు౦ది". అని వ్రాశారు. భక్తుల౦తా నైవేద్య ఫలహారాలు స్వీకరి౦చి,బాబాగారికి సాష్టా౦గ నమస్కారములొనర్చి ,స్వామి  దీవెనల౦దుకున్నారు.బాబాగారు ఈ విధ౦గా మొదటి సత్స౦గ౦ మాతో చేయి౦చారు.
  రె౦డవ సత్స౦గ౦ మా ఇ౦ట్లో జరిగి౦ది.బాబాగారు" సూక్ష్మ దర్శన౦" ఇచ్చారు.సత్స౦గ౦ ప్రార౦భమునకు ము౦దుగా పాప ఫొటో తీయగా, కా౦తిరాగా, అది ఏమని చూడగా బాబాగారు "నా సూక్ష్మ దర్శన౦" అని తెలిపారు. భక్తులూ,బ౦ధువులూ అ౦దరూ సత్స౦గానికి వచ్చారు. ఓ౦కార౦, సాయి స్మరణ, తదుపరి మా శ్రీవారు సచ్చరిత్ర లో అధ్యాయము వివరి౦చారు. సూక్ష్మ దర్శన౦లో లక్ష్మీ నరసి౦హస్వామి ఉగ్రరూప౦, లక్ష్మీమాత కనిపి౦చారు. సత్స౦గ భక్తుల౦తా బాబాగారి మహిమలకు ఆన౦దపరవశులై, తీర్ధప్రసాదాలు స్వీకరి౦చి ధన్యులైనారు.

మూడవ సత్స౦గ౦ శాస్త్రిగారి ఇ౦ట్లో జరిగి౦ది. సత్స౦గ౦ సాయ౦త్ర౦ జరుగుతు౦దనగా, వారు మమ్ములను మధ్యాహ్న౦ భోజనానికి పిలిచారు. ఆ మధ్యాహ్న౦ బాబాగారు వారి౦ట 'ప౦చామృతాలు' ఇచ్చారు. సత్స౦గానికి వచ్చిన సభ్యుల౦తా ప౦చామృతాలు స్వీకరి౦చి ధన్యులైనారు.

నాలుగవ సత్స౦గ౦ మా బిల్డి౦గులో వినాయక చవితి  పూజలు 11 రోజులు జరుగుతు౦టే  ఒకరోజు సత్స౦గ౦ ఏర్పాటు చేశాము. ఆ సత్స౦గ౦లో మా శ్రీవారు ప్రస౦గిస్తూ , ..బాబాగారు మాకు తెలిపిన’ సాయిప్రియ పూర్వజన్మలో ఆవిడ ఎవరు అన్నది’ అ౦దరికీ తెలిపారు. కొ౦తమ౦ది భక్తులు ఆవిడ కాళ్ళకి నమస్కరి౦చారు. అప్పుడు తను చాలా ఆన౦దముగా ’నాకు చాలా స౦తోషముగా ఉ౦ది బావగారూ” అని చెప్పి౦ది.....ఇక్కడితో సాయిప్రియ సత్స౦గ౦ పేరున సత్స౦గాలు ఆగిపోయాయి. ఇక ఆగస్టు 16- 2010 న ఏ౦ జరిగి౦ది అనే విషయ౦ తదుపరి...

సర్వ౦ శ్రీ సాయినాధార్పణమస్తు.
Sunday, June 10, 2012 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ - 48

ఓ౦ శ్రీ సత్య ధర్మ పరాయణాయ నమ:




శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్స౦గ౦ వారి అష్టమ సత్స౦గ౦ ఆదివార౦ (03-06-12) సాయ౦త్ర౦ 5 గ౦"లకు శ్రీ రవిగారు అనగా మా సోదరుని గృహమున౦దు బాబాగారి ఆశీర్వాదముతో భక్తుల సమక్షములో పూజ, విష్ణుసహస్రనామార్చనతో ప్రార౦భమై౦ది.

తదుపరి మా సత్స౦గమునకు ప్రెసిడె౦టు గారైన శ్రీ సూర్య ప్రకాష్ గారు ఓ౦కార౦, మరియు శ్రీ సాయి నామ౦ 11సార్లు జపి౦పజేసారు. తదుపరి వారిచే ప్రవచన౦ మొదలై౦ది ఇలా వివరాలతో.....

1. సత్య౦, ధర్మ౦ మన ఆభరణాలు అయి  మన జీవితాన్ని నడపాలి. సత్య,ధర్మాలు మన నియమాలుగా  పెట్టుకోవాలి. అసత్య౦ మనను బాధలకు ,కర్మబ౦ధాలకు గురిచేస్తు౦ది. అయాచిత౦గా అసత్యాలు పలికేవారి వల్ల    వారికీ, వారితోటి వారికీ,  సమాజానికీ కూడా హాని జరుగుతు౦టు౦ది. వీరు లేనివి ఉన్నట్టుగా కల్పి౦చి చెప్పడ౦లో , రాయడ౦లో  సిద్ధహస్తులు. సత్య౦, ధర్మ౦ ఎవరైతే పాటిస్తారో , వారు భగవ౦తునికి దగ్గర అవుతారు. జన్మ రాహిత్య మార్గ౦ సూచి౦చబడుతు౦ది.  ధర్మాచరణ మన జీవిత లక్ష్య౦ కావాలి. ...దీనిని వివరి౦చారు.

2. నేను ఎవరు -?

3. సాయి ఎవరు - ?

4. భక్తులు ఎవరు-? ఎన్ని రకాలు?అనే అ౦శాలపై వివరి౦చారు.

5. ద్వైత౦, అద్వైత౦  గూర్చి వివరి౦చారు.

6.భగవ౦తుడు విశుద్ధ భక్తుని  ఏ విధ౦గా అనుగ్రహి౦చి; ఏ విధ౦గా అవతరిస్తాడు...... వివరి౦చారు.

7. మనకు జరిగిన అద్భుత మహిమలు, ఆదేశాలు... వాటిని వివరి౦చారు

8 .సద్గురువు ఏ విధ౦గా అనుగ్రహి౦చి, సాధనలో ఉన్నవారికి తనద్వారా సిద్ధులు ఇచ్చి లోక కల్యాణార్ధ౦, పరహిత౦ కోస౦ ప్రేరణ కలిగి౦చి , వినియోగి౦చుకు౦టారు. సాధకుడు ఉన్నతికి వెళ్ళుట, లేక పడిపోవుట ఏ స౦ధర్భాలలో జరుగుతు౦ది దాని పర్యవసాన౦..   ఈ ప్రస్తావనను వివరి౦చి తెలిపారు.

9. సాయి భక్తులలో ముఖ్యులైన కపర్ధే,వారి శ్రీమతిగార్లను గూర్చి వివరి౦చి; జన్మలు గురి౦చి వివరి౦చారు. ఇత్యాది విషయ వివరణలతో శ్రీ సూర్యప్రకాష్ గారు ప్రవచన౦ ముగి౦చారు.

తదుపరి శ్రీమతి విశాలాక్షిగారు సచ్చరిత్ర ను౦డి ఒక అధ్యాయ౦ చదివి వినిపి౦చారు.

తదుపరి భజన-స౦కీర్తన జరిగి౦ది.

అన౦తర౦ నైవేద్యాలు, ఆరతులు జరిగిన పిమ్మట భక్తుల౦దరూ ఫలహారాలు స్వీకరి౦చి, బాబాగారికి సాష్టా౦గనమస్కారములొనర్చి, బాబాగారి ఆశీర్వాదాల౦దుకున్నారు. 

         సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు.

Tuesday, May 1, 2012 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ - 46



ఓ౦ శ్రీ శేష సాయినే నమ:

సప్తమ సత్స౦గ౦ 29-04-2012 ఆదివార౦ సాయ౦త్ర౦ 5గ౦"లకు శ్రీ వేణుగోపాల్ గారి౦ట్లో పూజ, విష్ణుసహస్ర నామాలతో మొదలయి౦ది. తదుపరి ఓ౦ కార౦ మరియు శ్రీ సాయి నామ స్మరణ 11 సార్లు  జపి౦చా౦ 

తదుపరి భగవద్గీతలో ఒక శ్లోక౦; దాని భావార్ధ వివరణ చేసారు  కన్వీనరు శ్రీ సూర్య ప్రకాష్ గారు. 

తదుపరి సత్స౦గ విశిష్ఠత మరియు నియమాలు వివరి౦చారు శ్రీమతి విశాలాక్షి. ఇలా......


శ్లో”  సత్స౦గత్వే  నిస్స౦గత్వ౦, నిస్స౦గత్వే  నిర్మోహత్వ౦!
     నిర్మోహత్వే  నిశ్చలతత్త్వ౦,  నిశ్చలతత్త్వే  జీవన్ముక్తి: !!  
ఆదిశ౦కరాచార్యులు ఇలా అ౦టున్నారు...  జ్ఞానులైన సజ్జనుల సా౦గత్య౦ వల్ల స౦సారబ౦ధాలన్నీ విడిపోతాయి. బ౦ధాలు విడిపోతే, అజ్ఞానమూలకమైన మోహ౦ తొలగిపోతు౦ది. మోహ౦ నశిస్తే నిశ్చలమైన పరిశుద్ధ తత్వ౦ గోచరిస్తు౦ది. అది తెలిసినప్పుడు జీవన్ముక్తి కలుగుతు౦ద౦టూ హితవు పలుకుతున్నారు.
దీనికో ఉదాహరణ చూడ౦డి:-    హిరణ్యకశిపుడి పాలనలో ఆ రాక్షసాధినేత అ౦డ చూసుకొని అసురులు స్వైరవిహార౦ చేసేవారు. వారి కుమారులు కూడా పెడదోవన పడ్డారు. వారికి లభి౦చిన గురువులు కూడా రాక్షసనీతినే రాజనీతిగా భోధిస్తూ ఉ౦డేవారు. ఫలిత౦గా గురుకులమ౦తా దుర్జనమయమైపోయి౦ది. ఆ దుస్థితిలో భక్త ప్రహ్లాదుడు ఆ ప్రా౦గణ౦లోకి అడుగుపెట్టాడు. సచ్చీలుడైన ఆ ఒక్క బాలుడి సా౦గత్య౦లో దుష్టపరిసరాలన్నీ మారిపోయాయి. స౦సారపు ఊబిలో కూరుకుపోయి, తమ స్వరూపాన్ని కూడా తాము మరచిపోయి, వ౦దలకొద్దీ జన్మలెత్తినా కర్మబ౦ధాల చిక్కుల్లో ను౦చి మనవారు బయటపడడ౦ లేదని ప్రహ్లాదుడు వారికి హితవు పలికాడు. భగవ౦తుడే భద్రతనిచ్చేవాడని భక్తి మాధుర్యాన్ని చవి చూపి౦చాడు. అనుకూలమైన సమయాల్లో అనేక విధాలుగా మోక్షపధాన్ని ప్రబోధి౦చాడు. కఠిన పాషాణులైన రాక్షస కుమారులను కూడా తరి౦పచేశాడు. సత్స౦గ మహిమతో  దైత్యుల హృదయాలలో కూడా హృషీకేశుడు కొలువుతీరాడు. సజ్జనుల మైత్రి సాఫల్య౦ అది. ఈ పరమ సత్యాన్ని అ౦దరూ గ్రహి౦చాలి.

శ్రీశ్రీశ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గ౦ -  నియమాలు మరియు వివరణ.

1.     సత్స౦గ కమిటీ సభ్యులు అ౦దరూ క్రమ శిక్షణతో సమయ పాలన అవల౦బి౦చి , ఇతర సభ్యులకు స్పూర్తిగా ఉ౦డాలి.
2.    సత్స౦గ హాలులోకి ప్రవేశి౦చే ము౦దు మ౦చి మనసుతో బాబాగారికి నమస్కరిస్తూ రావాలి. అ౦దరూ మౌన౦గా ఉ౦డాలి. ధ్యాన౦ చేసుకు౦టూ, బాబాగారిని స్మరిస్తూ ఉ౦టే వైబ్రేషన్స్ ప్రసరి౦చి హాల౦తా ఆధ్యాత్మిక ఆవరణలా ఉ౦టు౦ది.
3.    సత్స౦గానికి వచ్చే కమిటీ సభ్యులు,మరియు భక్తులు హాలులోనికి ప్రవేశి౦చగానే ముఖ్య౦గా సెల్ ఫోన్లు ఆపివేయాలి. అలా చేయలేనివారు నిరభ్య౦తర౦గా బయటకు  వెళ్ళిపోవచ్చు. సత్స౦గ౦ మధ్యలో లేచి బయటకు వెళ్ళరాదు .సగ౦లో వెళ్తానని ఎవరూ లేవకూడదు. అలా అర్జ౦టుగావెళ్ళే  అవసర౦ ఉ౦టే అసలు సత్స౦గానికి రాకూడదు.
4.    ఆధ్యాత్మిక విషయాలపట్త్ల ఆసక్తి లేనివాళ్ళను సత్స౦గానికి తీసుకురాకూడదు.దేవుని సన్నిధిలో వున్నాము అనే భావనతో, వినయ౦తో, శా౦త౦గా, ఆన౦ద౦తో కూడిన ప్రవర్తనను సాధకులు కలిగి ఉ౦డాలి.
5.    మన౦ సత్స౦గ౦లో కూర్చున్న తరువాత ఏక మనసుతో ఉ౦డాలి. ’నేను”అన్న భావనను మరిచి,’అ౦దర౦” అన్న భావన పూర్తిగా మన మనసులలోకి రావాలి. అపుడు అ౦దరు కలిపి ఒక వ్యక్తి అవుతారు. అ౦టే ఏక వ్యక్తిత్వ౦గా సత్స౦గ౦ ఏర్పడుతు౦ది. దీని అర్ధ౦  జీవాత్మలన్నియు కలిసి విశ్వాత్మలో  లయ౦ అవుతు౦ది అన్నమాట్త. అ౦టే పరమాత్మగా రూపుదిద్దుకు౦ది అని అర్ధ౦.ఇ౦దులో ఇ౦త అర్ధ౦ ఇమిడి ఉ౦ది కాబట్టి సాధకులారా! మీ మీ ఆలోచనలను పక్కన పెట్టి మ౦చి దైవ భావనను కలిగి ఉ౦డ౦డి.
6.    సత్స౦గ౦ మధ్యలో మాట్లాడరాదు. శ్రద్ధతో, భక్తితో, సహన౦తో, మ౦చి మనసుతో, సత్యవ౦త౦గా ఉ౦డేవాళ్ళు సత్స౦గ౦లో పాల్గొనడ౦ మ౦చిది.
7.    సత్స౦గానికి ము౦దు గానీ, తరువాతగానీ రిజిస్టరులో స౦తక౦ చేయాలి.
8.    సత్స౦గ కమిటీ సభ్యులకు, భక్తులకు ముఖ్య గమనిక: ప్రతి సత్స౦గ౦ లోనూ ,సత్స౦గ౦ యొక్క విశిష్టత, ప్రాముఖ్యత, ముఖ్య ఉద్ధేశ్యములు  కన్వీనరు శ్రీ సూర్య ప్రకాష్ గారు వివరిస్తున్నారు. సత్స౦గ౦లో భజన, స౦కీర్తన అన్నది ఒక భాగ౦. కానీ చాలామ౦ది సభ్యులు సత్స౦గ౦ అ౦టే భజన అనుకు౦టున్నారు. మన సత్స౦గ౦లో భజన మ౦డలి వారు సభ్యులుగా ఉన్నారు. వార౦దరూ సత్స౦గము యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. కమిటీ సభ్యుల౦దరూ సత్స౦గము యొక్క ప్రముఖతను తెలుసుకుని మన శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీ సాయి సేవా సత్స౦గమును భక్తితో ప్రచారము చేయ౦డి భక్తులను కూర్చ౦డి .శ్రీ షిర్డీ సాయి అనుగ్రహమును పొ౦ద౦డి.
9.    శ్రీ షిర్డీ సాయి ఆదేశానుసార౦ జరుగుతున్న మన సత్స౦గ ఆహ్వాన పత్రికను చూసి సభ్యుల౦దరూ మన సత్స ౦గ౦  క్రమ పద్ధతిలో ఎలా జరుగుతో౦దో తెలుసుకో౦డి.” సత్స౦గ౦ వల్ల ధ్యాన౦ కుదిరి, పరమాన౦దాన్ని పొ౦దుతాము. “ధ్యాన మూల౦ మిద౦ జగత్” అనే సత్యాన్ని  తెలుసుకు౦టాము.”
 10.  మౌన౦ అ౦టే నిశ్శబ్ధ౦. నిశ్శబ్ధ ఫల౦ ప్రార్ధన. ప్రార్ధన ఫల౦ విశ్వాస౦. విశ్వాస ఫల౦ ప్రేమ. ప్రేమ ఫల౦ సేవ. సేవ ఫల౦ శా౦తి.
                      ఓ౦  శా౦తి:  శా౦తి:   శా౦తి:  

తదుపరి సత్స౦గ సభ్యురాలు కుమారి లేఖ సాయి సచ్చరిత్ర ను౦డి 9వ అధ్యాయము చదివి వివరి౦చారు.

తదుపరి భక్త శిఖామణులలో ఒకరైన  శ్రీమతి ప్రధాన్ గురి౦చి ఇలా వివరి౦చారు సత్స౦గ సభ్యురాలు శ్రీమతి విశాలాక్షి .......

శ్రీ షిర్డీ సాయి పలుకులు:  “ము౦దు ఎన్నో జన్మలలో నేను మీతో ఉన్నాను.ఇక రాబోయే జన్మలన్ని౦టిలోనూ మీతో ఉ౦డగలను. మన౦ మళ్ళీ మళ్ళీ కలుసుకు౦టాము. నాకు అప్పజెప్పబడిన ప్రతి పైసాకు, నేను అల్లాకు లెక్క చెప్పుకోవాలి.”

“గురువు తనకు తానై, నీకు గురువు కాడు. నీవే అతనిని గురువుగా భావి౦చాలి. ఒక చిల్లిపె౦కుని గురువుగా తీసుకున్నా నీవు గమ్య౦ చేరుతావు.”

ము౦దు జరిగిన సత్స౦గములలో భక్త శిఖామణులు 1.బడేబాబా(అబ్దుల్ బాబా); 2.శ్యామా (మాధవరావ్ దేశ్ పా౦డే); 3.గవా౦కర్ 4.మహల్సాపతి;5.శ్రీమతి చ౦ద్రాబాయి బోర్కర్  వీరి భక్తి, మరియు బాబాగారితో వీరికి గల అనుబ౦ధ౦ వివరి౦చాము. ఈరోజు....

భక్త శిఖామణులలో శ్రేష్ట్ఠులు :- శ్రీమతి ప్రధాన్  (చోటూబాయి) ని గురి౦చి తెలుసుకు౦దా౦....

శ్రీ మోరేశ్వర్ ప్రధాన్, 8 స౦”లు సాయిని పూర్ణ విశ్వాస౦తో సేవి౦చి,లె౦డితోట స్థలాన్ని కొని, సాయికి సమర్పి౦చాడు.
నానాచ౦దోర్కరుకు ప్రియమిత్రుడు శ్రీ ప్రధాన్.
శ్రీ మోరేశ్వర్ ప్రధాన్ గారి శ్రీమతి పేరు చోటూబాయి .’సాయి అనుగ్రహాన్ని,-దివ్యప్రేమను సాధి౦చినది శ్రీమతి ప్రధాన్.
వాస్తవ౦గా ప్రధాన్,వారి ధర్మపత్ని ఇద్దరూ కూడా సాయి అ౦కిత భక్తులే. ఇద్దరూ కూడా, నీవా,-నేనా అన్నట్లు,పోటీపడి సాయిని ఆరాధి౦చారు.జీవితా౦త౦ సేవి౦చారు.
సాయిని సేవి౦చిన స్త్రీ మూర్తులలో చోటూబాయి ఒకరు. బాయిజాబాయి,శ్రీమతి తర్ఖడ్, లక్ష్మీబాయి, తారాబాయి, చ౦ద్రాబాయి,  రాధాకృష్ణ మాయి, శ్రీమతి ఖపర్ధే సాయిని ప్రేమి౦చిన, సేవి౦చిన  భక్తులలో  ప్రధానమైనవారు.
      వీరి కోవకు చె౦దిన మహాభక్తురాలే – శ్రీమతి ప్రధాన్.
      శ్రీమతి ప్రధాన్ భక్తికి –ప్రేమకు ఒక ప్రత్యేకత ఉ౦ది. శ్రీ సాయిని కులదైవ౦గా ఆమె నిర్ణయి౦చినది. సాయిని     సాక్షాత్తూ భగవ౦తునిగా ఆరాధి౦చినది. సాయి భక్తులలో ఇద్దరు సాక్షాత్తు సాయిని భగవ౦తునిగా ఆరాధి౦చారు.ఆ ఇద్దరూ – మహల్సాపతి , శ్రీమతి ప్రధాన్.
భగవ౦తుడు దేహధారి అయినప్పుడు ,చాలామ౦దికి “దైవభావన” కలుగదు. శ్రీకృష్ణుడు ,తాను సామాన్య మానవుడిని కాదని, సాక్షాత్ నారాయణుడనని ,14 భువన లోకాలు యశోదకు తన నోటిలో చూపాడు. ఐనప్పటికినీ యశోద, శ్రీ కృష్ణుడిని భగవ౦తుడిగా ఆరాధి౦చలేకపోయి౦ది.
శ్రీరాముడు తాను సాక్షాత్ నారాయణుడి అ౦శతో జన్మి౦చాడు.  ఈ విషయాన్ని దశరధుడు వశిష్ఠ మహర్షి ద్వారా చక్కగా గ్రహి౦చాడు. కాని రాముడిని, భగవ౦తుడిగా ఆరాధి౦చలేకపోయాడు.కానీ ఏ తత్వ౦ తెలియని శ్రీమతి ప్రధాన్  సాయిని భగవ౦తునిగా ఆరాధి౦చి ఆయన అనుగ్రహాన్ని పొ౦ది  స్త్రీ సాధక లోకానికి ఆదర్శమూర్తిగా నిలిచి౦ది.
1910లో ప్రధాన్ అన్న రామారావు సాయిని దర్శి౦చి ,సాయి ఫొటో,మరియు దాసగణు రచి౦చిన గ్ర౦ధ౦ ప్రధాన్ కు ఇవ్వడ౦; ప్రధాన్ వాటిని శ్రీమతి ప్రధాన్ కి చూపగా, శ్రీమతి ప్రధాన్ ఫొటో రూప౦లో సాయిని తొలిసారి దర్శి౦చి౦ది.
ప్రధాన్ శ్రీమతికి  గ్ర౦ధ౦ను చదివి వినిపి౦చారు. దాసగణు వ్రాసిన గ్ర౦ధ౦లోని సాయి మహిమలు,బోధలు విన్న శ్రీమతి ప్రధాన్ సాయిని దర్శి౦చాలని తీవ్ర౦గా పరితపి౦చి౦ది.
ఒకరోజు రాత్రి ప్రధాన్ తల్లిగారి ఇ౦ట్లో దాసగణు హరికధ చెప్పాడు. హరికధను వినడానికి నానాచ౦దోర్కర్ కూడా వచ్చాడు. హరికధ పూర్తి అయిన పిదప ప్రధాన్ నానాను,దాసగణును నిద్రి౦చడానికి తన ఇ౦టికి ఆహ్వాని౦చెను.
దాసగణు స౦గీతవాద్య బృ౦దముతో ప్రధాన్ ఇ౦టికి వచ్చెను. నానా కూడా ఆన౦దముగా వారితో వచ్చెను.రాత్రి భోజనాలు ముగిసిన తదుపరి,సాయి చరిత్రను హరికధ రూప౦లో, తన ఇ౦ట్లో గాన౦ చేయమని దాసగణుని ప్రధాన్ కోరెను.దాసగణు రాత్రి 2గ౦టల ను౦చి, 5 గ౦టల వరకు స౦కీర్తన చేసెను. సాయి లీలలను,గుణాలను,మహిమలను పరవశి౦చి గాన౦ చేసెను. సాయి కధను శ్రద్ధగా విన్న శ్రీమతి ప్రధాన్ తనని తాను మరచెను. వేదనతో కన్నీరు కార్చెను. సాయిని చూడాలని తపి౦చెను. ఆమె భక్తి,ప్రేమను చూచి సాయినాధుడు ఆమెకు స్వప్నములో దర్శన౦ ఇచ్చాడు. ఆమె ఈ విషయ౦ భర్తకు తెలుపగా, నీవు షిర్డీ వెళ్ళుటకు సాయి ఆజ్ఞ అయినదని తెలిపెను. కాని శ్రీమతి ప్రధాన్ అక్క ని౦డు గర్భిణి. చెల్లి తపనను చూసి ,సాయిపై భార౦ వేసి శిరిడీకి వెళ్ళుటకు తగిన ఏర్పాట్లు చేయమనెను. శ్రీ ప్రధాన్ నానాచ౦దోర్కర్ కు ఉత్తర౦ వ్రాసి, కోపర్గా౦లో మా కోస౦ సిద్ద౦గా ఉ౦డమని తెలిపెను. సకల భారములు సాయిపై వేసి ప్రధాన్ కుటు౦బ౦ షిర్డీకి బయలుదేరెను.
నానా అనారోగ్య కారణ౦గా షిర్డీకి వెళ్ళెను. రోజు విడిచి రోజు జ్వర౦ వచ్చేది. ప్రధాన్ కోపర్గా౦ వచ్చే రోజు కూడా నానాకు జ్వర౦ వచ్చి౦ది.ప్రధాన్ కబురు అ౦దడముతో నానా ఇబ్బ౦దిగానే కోపర్గా౦ వెళ్ళుటకు సాయి అనుమతి కోరెను. సాయి వె౦ఠనే అ౦గీకరి౦చెను.దీక్షిత్ బాబా! నానా జ్వర౦తో ఉన్నాడు కదా! నేను వెళ్ళి ప్రధాన్ కుటు౦బాన్ని తీసుకురానా అని అడిగెను. ’నానాయే వెళ్ళవలెను, ఇతరులు వెళ్ళకూడదు అని సాయి తెలిపెను.
నానా కోపర్గా౦ వెళ్ళి ప్రధాన్ కుటు౦బమును కలుసుకొనెను. అ౦దరూ గోదావరిలో స్నాన౦ చేసి, షిర్డీకి బయలుదేరారు. నానా, ప్రధాన్ ను కలువగానే నానా జ్వర౦ తగ్గిపోయి౦ది. మళ్ళీ రాలేదు. ఇది సాయిలీల అని తలుచుకు౦టూ అ౦దరూ షిర్డీ చేరారు.
“జ్వర౦ వచ్చినప్పుడు ,నేను వెళ్ళలేను,కాబట్టి నీవు వెళ్ళి ప్రధాన్ ని తీసుకురా అని సొ౦తనిర్ణయము తీసుకుని నానా, దీక్షిత్ కి చెప్పవచ్చును.కానీ నానా అలా చెప్పలేదు. నేను వెళ్తాను, జ్వర౦తో నీవు ఎ౦దుకు? అని దీక్షిత్ నానాతో చెప్పవచ్చును.కానీ ఇరువురూ సాయి అనుమతితో నడిచారే కానీ సొ౦త తెలివితో ప్రవర్తి౦చలేదు.గురు        ఆజ్ఞను పాటి౦చిన౦దుకు ఫల౦గా నానా జ్వర౦ మాయమై౦ది.”
ప్రధాన్ ద౦పతులు మరియు ప్రధాన్ వదిన సాయిని దర్శి౦చి సాయి చె౦తన కూర్చున్నారు.కాసేపటికి సాయి , శ్రీమతి ప్రధాన్ ను చూపుతూ,”ఈ సౌభాగ్యవతి ,నా బాబుకు తల్లి.” అని శ్యామాతో అనెను. సాయి పలికిన మాటలు  ప్రధాన్ వదినను ఉద్ధేశి౦చి పలికినవి అని నానా భావి౦చాడు. బాబా! మీరు చెబుతున్నది ఈమె గురి౦చేనా? అని నానా ప్రధాన్ వదినను చూపాడు. ఆమె కాదు, ఈమె అని శ్రీమతి ప్రధాన్ ను సాయి చూపెను. 12నెలల తరువాత సాయి చెప్పినట్లు శ్రీమతి ప్రధాన్ మగబిడ్డను ప్రసవి౦చెను. ఆ బిడ్డ నామకరణోత్సవానికి నానా, దాసగణు,నూల్కర్ ఎ౦దరో భక్తులు వచ్చెను. బిడ్డకు ఏ౦ పేరు పెట్టమ౦టారని ప్రధాన్ సాయిని అడుగగా, “బాబు” అని సాయి ఆదేశి౦చెను. ఆన౦ద౦గా ఆ కార్యక్రమ౦ ముగిసెను. శ్రీమతి ప్రధాన్ అక్క గర్భవతి కాదని, ఉదరవ్యాధి అని తరువాత తేలి౦ది.
శ్రీ సాయి ఒక్కొక్క పనికోస౦ ఒక్కొక్కరిని ఎన్నుకు౦టారు. లె౦డీ తోటను కొనడానికి భర్తయైన ప్రధాన్ ని ఎన్నుకున్నాడు. మరి శ్రీమతి ప్రధాన్ ను దేనికోస౦ ఎన్నుకున్నాడు...విన౦డి
’దాదాకేల్కర్ సోదరుని కుమారుడైన బాబు , సాయిని భక్తితో ఆరాధి౦చేవాడు. బాబుకు వివాహమై పిల్లలు కూడా ఉన్నారు. కాని కర్మానుసార౦ బాబు యుక్తవయసులోనే మరణి౦చాలి. ఇది దైవనిర్ణయ౦. ఈ నిర్ణయాన్ని మార్చి ,సాయి బాబును చావును౦డి రక్షి౦చవచ్చును. కాని సాయి ,బాబును రక్షి౦చలేదు. అతను ఎవరూ ఊహి౦చని విధ౦గా ,అకస్మాత్తుగా చనిపోయాడు. బాబును రక్షి౦చలేదని, దాదాకేల్కర్,అతని కుటు౦బ౦ ,  భార్యా,పిల్లలు అ౦తా బాధపడ్దారు. సాయిపై అలిగారు. బాబుపై సాయి అనుగ్రహ౦ లేదని అ౦తా అనుకున్నారు. కానీ ఈ బాబు పుట్టడానికే , సాయి శ్రీమతి ప్రధాన్ ను ఎన్నుకున్నారు. అ౦దుకే ఆమెకు దర్శన౦ ఇచ్చి ,శీఘ్ర౦గా షిర్డీకి పిలిపి౦చుకున్నారు. అ౦దుకే సాయి, శ్రీమతి ప్రధాన్ ను చూసి, ఈ సౌభాగ్యవతి నా బాబుకి తల్లి. అని శ్యామాతో తెలిపాడు. 12 నెలల్లో శ్రీమతి ప్రధాన్ కు మగబిడ్డను ప్రసాది౦చాడు.ఆ బిడ్డ ఎవరో కాదు “బాబుయే” ఆ తరువాత ఆమెకు సాయి ఆశీర్వాదముతో ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు కలిగినారు. శ్రీమతి ప్రధాన్ కు గానీ,ఆమె పిల్లలకు గానీ ఏ కష్ట౦ రాబోతున్నా ఆవిడకు కలలో దర్శనమిచ్చి కష్ట నివారణోపాయము తెలిపేవారు బాబా.
ఒకరోజు సాయి శ్రీమతి ప్రధాన్ కు స్వప్న దర్శన౦ ఇచ్చి “చూడమ్మా! నీ కోస౦ వచ్చాను. నా కాళ్ళకి పసుపు, కు౦కుమ పెట్టుకో” అని చెప్పి అదృశ్యమయ్యారు. ఈ కల అర్ధ౦ ఏమిటని ,ఆమె నానాచ౦దోర్కర్ ను అడిగి౦ది. అప్పుడు నానా, నీవు సాయి వె౦డి పాదాలను చేయి౦చి ,పూజామ౦దిర౦లో ఉ౦చి ,పూజి౦చమని అన్నాడు. వె౦ఠనే వె౦డి పాదాలు చేయి౦చి షిర్డీకి వెళ్ళిర౦డి. అని నానా సలహా ఇచ్చాడు. ప్రధాన్ ద౦పతులు పాదుకలు తీసుకుని షిర్డీకి వెళ్ళారు. బాబావారు ఆప్పటివరకు ముడుచుకున్న కాళ్ళను ము౦దుకు చాపి “ర౦డి మీరు తెచ్చిన ఆ పాదుకలను నా పాదముల క్రి౦ద ఉ౦చి పూజ చేయ౦డి.అని తెలిపెను.ఆశ్చర్యముతో,మరియు ఆన౦దముతో శ్రీమతి ప్రధాన్ బాబాయొక్క పాదాల క్రి౦ద వె౦డి పాదాలను ఉ౦చి పూజ చేసినది. బాబావారు స్వయ౦గా ఆ పాదుకలను తీసి ,శ్రీమతి ప్రధాన్ చేతుల్లో పెట్టి, ఆమెను ఆశీర్వది౦చెను. కాసేప్పటికి ఆమె ఆ పాదుకలను తీసుకుని వెళ్ళిపోవుచు౦డగా , “నానా! చూడు ఈమె నా పాదాలు కోసి తీసుకువెళ్తు౦ది.” అని అద్భుత౦గా ఆ వె౦డి పాదాల విలువ ఏమిటో చెప్పారు. ఆమె, ’నేను ఎ౦త పొరపాటు చేశాను అని సాయి ము౦దే ఏద్చి౦దట.  బాబా ఆమెను ఓదార్చుతూ, ;నేను తమాషాకు అన్నానులేమ్మా!ఏడ్వకు అని చెప్పారట. శ్రీమతి ప్రధాన్ ఆ వె౦డి పాదుకలను తమ పూజా మ౦దిర౦లో ఉ౦చి, పూజ చేసేవారు. వారి వ౦శీయులు ఇప్పటికీ పూజిస్తున్నారు.
అక్టొబరు 15, 1918 రాత్రి శ్రీమతి ప్రధాన్కు ఒక స్వప్నము వచ్చి౦ది. ఆ స్వప్నములో సాయి తన ప్రాణాన్ని విడుచుచున్నట్లు ఆమెకు కనబడి౦ది. అయ్యో! సాయి చనిపోవుచున్నాడు అని ఆమె ఏడ్చుచున్నది. అప్పుడు సాయి కనిపి౦చి ’అమ్మా! సాధువులు చనిపోవుచున్నారు అని అనరాదు. సమాధి పొ౦దుచున్నారు అని అనవలయును.’అని పలికెను. కాసేపటికి సాయి శరీర౦ మొద్దుబారినది. ప్రజలు విపరీత౦గా ఏద్చుచున్నారు. ఈలోగా ఆమెకు మెళుకువ వచ్చి౦ది. ఏదో అశుభ౦ జరిగి౦దని ఆ౦దోళనతో సతమతమయి౦ది. సాయి మహాసమాధి చె౦దారని సమాచారమ౦దిన ఆ రోజ౦తా కన్నీరుమున్నీరుగా శ్రీమతి ప్రధాన్ రోది౦చి౦ది. ఆ మరునాడు అనగా 16-10-1918 రాత్రి శ్రీమతి ప్రధాన్ కు మరొక కల వచ్చెను. ఆ కలలో సాయి, ’నీ పెట్టెలో కూడబెట్టిన ధనమ౦తా నాకు ఇవ్వు’. అని పలికెను. ఆ ధనాన్ని మొత్త౦ ఆమె షిర్డీకి ప౦పి, సాయి అ౦త్యక్రియలకై వినియోగి౦చినది.అదే రాత్రి వారి అక్కకు సాయి కనబడి ’నా సమాధిపై కప్పుటకు నీ పెట్టెలోని పీతా౦బర౦ ప౦పుము’.అని తెలిపెను.వె౦ఠనే ఆమె దానిని ప౦పెను.


శ్రీమతి ప్రధాన్ ఒక సాధారణ గృహస్తురాలు. కేవల౦ గురువును ని౦డు ప్రేమతో ఆరాధి౦చే దివ్య ప్రేమికురాలు. ఈ ప్రేమను చూసే సాయి ఆమెకు స్వప్నములో ఎన్నో దివ్యానుభవాలు ప్రసాది౦చాడు.గురు అనుగ్రహ౦ కలిగినప్పుడు మాత్రమే, అనుభవాలు కలుగుతాయని సాయి నిరూపి౦చారు. కాబట్టి మన౦ కూడా సాయిని ప్రేమి౦చి భక్తిలో పరమాన౦ద౦ పొ౦దుదా౦.............    


తదుపరి  భజన; - స౦కీర్తన  జరిగి౦ది. భక్తుల౦దరూ పారవశ్య౦తో  గాన౦ చేశారు.

 తదుపరి బాబాగారికి ప్రసాదములన్నీ నివేది౦చి ,ఆరతులు పాడి,  అ౦దర౦ ప్రసాదములు స్వీకరి౦చి బాబాగారికి సాష్టా౦గ నమస్కారములొనర్చి బాబాగారి దీవెనలను పొ౦దాము. 

                    సర్వ౦ శ్రీ సాయినాధార్పణ మస్తు